Annamalai: కేంద్ర బడ్జెట్‌పై నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ చేసిన విమర్శలకు, తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక విధానాలు ఎలా రూపొందించబడతాయనే ప్రాథమిక అవగాహన ఆయనకు లేదని ఆరోపించారు. విజయ్ బడ్జెట్‌ని ఉద్దేశించి విమర్శి్స్తూ.. తమిళనాడుని బడ్జెట్‌లో పట్టించుకోలేదని, జీఎస్టీ తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. "తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వలేదు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు కూడా…
Duddilla Sridhar Babu : నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయన్నారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదని, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కు ప్రకారం రావలసిన నిధులు కూడా రాలేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల…
Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో సీనియర్ సిటిజన్లకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి ఉపయోగపడేలా కీలకమైన పన్ను సంస్కరణల్ని ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1,00,000 కు పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనను సీనియర్ సిటిజన్లు స్వాగతిస్తున్నారు. దీని వల్ల మెరుగైన ఆర్థిక ఉపశమనం ఉండటంతో పాటు, వారిపై పన్ను భారం తగ్గబోతోంది, వారి పొదుపును పెంచే లక్ష్యంగా ఈ…
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) లోక్‌సభలో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న ఆమె, మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ఇక బడ్జెట్ ముఖ్యాంశాల విషయానికి వస్తే.. బడ్జెట్ ప్రసంగం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 53 లక్షల…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు…
బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 77,500.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.90 పాయింట్లు పెరిగి 23,508.40కి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో పెరుగుదల కనిపించింది. 30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలలో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి), నెస్లే నాలుగు శాతానికి పైగా లాభాన్ని నమోదు చేశాయి. ఎల్ అండ్ టీలో 4.31 శాతం, నెస్లేలో…
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.
Union Budget 2025: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.