రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్
PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జులై 23వ తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో రేపు (గురువారం) భేటీ అవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని తేల్చిచెప్పారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిన జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రం
సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెప్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌లో పేదలకు ఉపయోగపడేది ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిలదీశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మహిళలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ కాలంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు.
గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒకెత్తు అయితే.. లక్షద్వీప్‌పై ఆమె చేసిన ప్రకటన మరొకెత్తు. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా స్పెషల్‌గా ఫోకస్ అయ్యాయి.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యంతర బడ్జెట్‌ను దేశ ప్రజల ముందు ఉంచారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బియ్యం ధరలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక, రేపటి నుంచే మార్కెట్ లోకి బియ్యం వస్తుంది.. వీటికి భారత్ రైస్ గా కేంద్రం నామకరణం చేసింది. ఈ భారత్ రైస్ ను కిలో కేవలం 29 రూపాయలకే విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది.