డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు..