ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి.. ఆయుధాలు, ఇతర సమాగ్రి సరఫరా చేస్తున్నాయి.. దీంతో.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? అనే చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో రష్యా విదేశాంగవాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని.. ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.. ఇక,…