Ukraine Russia War: కీలక ప్రకటన చేయనున్న పుతిన్.. ఇక విధ్వంసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చర్య ఫలితాలను పుతిన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ఐతే.. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్రమణకు వెళ్లినట్లు కానీ పుతిన్ అధికారికంగా ప్రకటించలేదు.
Read Also: Jodhpur clashes: జోధ్‌పూర్ ఘర్షణలు.. చర్యలకు కేంద్రమంత్రి డిమాండ్
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ యూదుడు కావడం వల్ల.. ఆ దేశంపై డీనాజిఫికేషన్‌లో భాగంగా దాడి చేపట్టినట్లు కూడా పుతిన్ వెల్లడించారు. మే 9వ తేదీన పుతిన్ చేసే ప్రకటనతో ఆ దేశం తన రిజర్వ్ దళాలను యుద్ధ రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు నెలలుగా సాగుతున్న వార్‌లో ఇప్పటి వరకు పది వేల మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని పశ్చిమ, ఉక్రెయిన్ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. రష్యా దండయాత్రతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సతీమణి త్వరలో రానున్నారు. ఉక్రెయిన్ నుంచి తలదాచుకోవడానికి ఆ దేశానికి వచ్చిన తల్లులను మదర్స్‌డే సందర్భంగా ఆమె కలుస్తారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తానికి.. ఉక్రెయిన్‌పై పుతిన్ అధికారిక ప్రకటన చేసే చాన్స్ ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?