ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అక్కడి పౌరులు, పార్లమెంటు సభ్యులు కూడా యుద్ధానికి మేం రెడీ అంటున్నారు. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తానూ యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పడం…
అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర…
విద్యార్ధులు విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికి గుర్తుకు వచ్చే దేశం ఉక్రెయిన్. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో…
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో రష్యా దళాలు పడిపోయాయి .. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటాం.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్…
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడం ప్రారంభించి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతున్నది. ఉక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఇప్పటికే పోలెండ్, హంగేరీ, రొమేనియా సరిహద్దుల్లో విమానాలను ఉంచి అక్కడి నుంచి భారతీయులు తరలించారు. ఉక్రెయిన్‌లో విమానాలకు ప్రవేశం నిషేదించడంతో దేశంలోని నలుమూలల ఉన్న భారతీయులను వివిధ…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో అక్కడ చిక్కుకునన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ ఎంబీసీతో పాటు.. సంబంధింత అధికారులతో మాట్లాడుతూ.. భారతపౌరులను దేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతపౌరులు ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలెండ్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెండ్ రాజధాని భారత రాయబార కార్యాలయం భారత్ పౌరులు, విద్యార్థులకు…
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మారనుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దానికి…
రష్యాను నిలువరిస్తామని, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొదటి నుంచి చెబుతూ వస్తున్నది. ఉక్రెయిన్ కోసం నాటో దళాలను సరిహద్దులకు తరలించి చాలా రోజులైంది. కానీ ఆ దళాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కాలేదు. అమెరికా సైతం తమ బలగాలను పోలెండ్‌కు తరలించింది. అయితే, రష్యాతో నేరుగా యుద్ధం చేయబోమని, ఉక్రెయిన్‌కు అవసరమైన సహకారం మాత్రమే చేస్తామని చెబుతూ వచ్చింది. నాటో, అమెరికా దేశాలు అండగా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగపాటే మిగిలింది. యుద్ధం వచ్చే…
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్లో విద్యార్ధులు మినహా ఇతర ప్రవాసాంధ్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ఆయన వెల్లడించారు. ఆ వివరాలను…