Ukraine Crisis: దాడుల నుంచి తప్పించుకుంటూ 30 కిమీ నడిచిన విద్యార్ధులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడం ప్రారంభించి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతున్నది. ఉక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఇప్పటికే పోలెండ్, హంగేరీ, రొమేనియా సరిహద్దుల్లో విమానాలను ఉంచి అక్కడి నుంచి భారతీయులు తరలించారు. ఉక్రెయిన్‌లో విమానాలకు ప్రవేశం నిషేదించడంతో దేశంలోని నలుమూలల ఉన్న భారతీయులను వివిధ మార్గాల ద్వారా సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు.
Read: Online Game: బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో సరికొత్త గేమ్…
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయవచ్చని వార్తలు వస్తున్న సమయంలో తమ కళాశాల నుంచి వెళ్లిపోతామని యాజమాన్యాన్ని కోరినప్పటికీ అందుకు ఒప్పుకోలేదని, రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో ఇబ్బందులు పడ్డామని, అప్పటికే దుకాణాలు మూసివేయడంతో ఆహారపదార్ధాలకు కొరత ఏర్పడిందని లీవూలో ఉంటున్న తెలుగు విద్యార్ధి విష్ణు పేర్కొన్నారు. లీవూ నుంచి పోలెండ్ సరిహద్దుల వరకు రావాలని అక్కడి నుంచి దేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత ఎంబసీ అధికారులు పేర్కొనడంతో దాదాపు 30 కిమీ మేర నడుచుకుంటూ వెళ్లి పోలెండ్ సరిహద్దులకు వెళ్లినట్టు పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల చలిలో తోటి విద్యార్ధులతో కలిసి పోలెండ్ సరిహద్దులకు చేరుకున్నట్టు తెలుగు విద్యార్ధి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!