ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం…
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే రెండుసార్లు యుద్ధం ఆపాలని రష్యాతో ఉక్రెయిన్ చర్చలకు దిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రష్యాతో చర్చలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు…
రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. ఒకటి పుతిన్.. రెండోది జెలెన్ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆయన రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ జెలెన్ స్కీ గురించే చాలా మందికి తెలియదు. నిజానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్‌స్కీ ఒక బిజీ నటుడు. పలు సినిమాలు టీవీ సిరీస్‌లలో హాస్య పాత్రలు పోషించారు.…
యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు అందిరినీ టెన్షన్ పెడుతోంది.. ఇది మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అణు యుద్ధం తప్పదా? అనే అనుమాలు కూడా ఉన్నాయి… అయితే, ఈ యుద్ధం కారణంగా చాలా మంది భారతీయులు మరీ ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది… ఇక, ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగా స్పందించే భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా.. ఈ యుద్ధ సమయంలో ఓ సరికొత్త…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ఇలా విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులకు వారి ఊర్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్‌టీసీ మరో ముందడుగు వేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల…
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య సమావేశం ముగిసింది. బెలారస్ వేదికగా సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని, రష్యా సైన్యం తమ దేశం నుంచి వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అటు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఈ డిమాండ్లకు ఇరుదేశాలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలంగా ముగిశాయి. ఒక్క…
నేడు ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను జమచేయనున్నారు. నేడు చెన్నైలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పుస్తకాన్ని రాహుల్‌గాంధీ అవిష్కరించనున్నారు. అంతేకాకుండా శరద్‌పవార్, స్టాలిన్‌లతో రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు. నేడు తొలివిడత మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5 రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెండు విడతల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.…
రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్‌లో ఇతర దేశాలకు చెందిన పౌరులతో పాటు, ఉక్రెయిన్ పౌరులు కూడా తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని గడుపుతున్నారు. అయితే నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్…
ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్ధులకు ఊరట లభిస్తోంది. మోడీ ప్రభుత్వం వివిధ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపింది. దీంతో భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలాంటి వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. పోలాండ్…