Suicide Attempt in Flight: విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passenger Suicide Attempt in Flight: తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇవా ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు.
ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 ఫ్లైట్ మార్చి 15న బ్యాంకాక్ నుంచి లండన్ బయల్దేరింది. విమానంలోని ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా అతడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం లండన్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి.. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Also Read
Also Read: Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!
స్థానిక లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండింగ్ కంటే ముందే వైద్య సిబ్బంది అతడికి ప్రధమ చికిత్స అందించారు. విమానం ల్యాండ్ అవ్వగానే ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ఇవా ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. అయితే ప్రయాణికుడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!