కరోనా సమయంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూ వచ్చారు. అయితే, యూకేకి చెందిన ఓ ప్యాకింగ్ కంపెనీ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. తమ కంపెనీ పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి, ప్యాకింగ్ చేసేందుకు ఉద్యోగులు కావాలని, ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన ఉద్యోగులకు ఏడాదికి 62,400 పౌండ్ల జీతం ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా రూ.63.20 లక్షలు. క్యాబేజీలు కోసి, ప్యాకింగ్…
క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్ 4వ…
ఇండో పసిఫిక్ తీరంలో చైనా ప్రాభల్యాన్ని తగ్గించేందుకు తక్షణమే ఓ బలమైన కూటమి అవసరం ఉందని భావించిన అగ్రరాజ్యం అమెరికా అటు బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి అకూస్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటిమి ఏర్పడటం వలన గతంలో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా 12 జలాంతర్గాముల కోసం చేసుకున్న ఒప్పందం వీగిపోయింది. దీనికి బదులుగా అమెరికా అస్ట్రేలియాకు అధునాతనమైన అణుజలాంత్గాములను సరఫరా చేస్తుంది. దీనిపై ఆస్ట్రేలియా, అమెరికాపై ఫ్రాన్స్ మండిపడింది. ఇక ఇదిలా ఉంటే ఆసియాలో చైనా ప్రాభల్యం…
కొవీషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో యూకే వర్సెస్ భారత్ అన్నట్లుగా తాజాగా పరిస్థితులు మారిపోయాయి. కొవీషీల్డ్ టీకా తయారు చేసింది బ్రిటన్ దేశానికి చెందిన కంపెనీయే అయినప్పటికీ కూడా ఆదేశం భారతీయుల విషయంలో అవలంభిస్తున్న విధానం విమర్శలకు తావిస్తోంది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్ కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ ఆదేశం ప్రకటించడం విడ్డూరంగా మారింది. దీనిని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతుండటంతో కేంద్ర సర్కారు సైతం దీనిపై రియాక్ట్ అయింది. యూకే విధానం సరైందని కాదని…
దక్షిణాసియాలో చైనా రోజురోజుకు తన దూకుడును పెంచుతున్నది. సైనిక బలగాన్ని పెంచుకుంటూ దక్షిణ సముద్రంతో పాటుగా ఇతర దేశాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే పాక్, శ్రీలంకతో పాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైకూడా చైనా కన్నుపడింది. అటు హాంకాంగ్, వియాత్నం కూడా తమవే అని చెప్తున్నది. రోజు రోజుకు చైనా తన బలాన్ని పెంచుకుంటుండటంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆసియాలోని ఇండియా, జపాన్, అస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అందరు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. కానీ టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అయితే టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ సమయంలో రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి టెస్ట్ ప్రారంభ సమయంలో మరోకొంత మంది భారత సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని…
క్రమంగా తాలిబన్లకు కూడా మద్దతు పెరుగుతుందా? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో.. ఎందుకంటే.. ఆఫ్ఘనిస్తాన్ను ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై మెజార్టీ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. కొన్ని దేశాలు వారికి కూడా మద్దతుగా మాట్లాడుతున్నాయి.. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనా.. తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటిస్తే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం వారికి మద్దతు పలికారు.. ఇక, రష్యా కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడింది.. తాజాగా, బ్రిటన్…
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్ మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది కోర్టు.. నీరవ్ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఇక్కడి నుంచి తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని..…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అన్ని దేశాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. బ్రిటన్లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్లను…
కరోనా కేసులు ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలను వేగవంతం చేసింది ప్రపంచం. ఎప్పుడైతే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటించిందో అప్పటి నుంచి ప్రపంచంలోని టాప్ దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇండియాలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ప్రపంచదేశాల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇజ్రాయిల్ తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో అందరికంటే ముందు నిలిచింది. 90 లక్షల…