ఇంట్లో ఉన్న పాత వస్తువులను చాలా మంది బయటపారేస్తుంటారు. అందులో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ తెలియకుండా వాటిని పడేస్తుంటారు. అలా బయటపడేసే ముందు ఒకటికి నాలుగుమార్లు చెక్ చేస్తే ఇలా మీకు కూడా పాత వస్తువుల్లో విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది కదా. బ్రిటన్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ తన దగ్గర ఉన్న పాత వస్తువులను పాత గిల్టు నగలను చెత్తలో పారేద్దామని అనుకున్నది. ఆ పాత వస్తువులను బయటపడేసేందుకు పక్కన పెట్టింది. అదే సమయంలో పక్కింటి నుంచి వచ్చిన ఓ మహిళ ఆ వస్తువులను పరిశీలించి పడేయడం దేనికి పాత వస్తువులు కొనుగోలు చేసే వారికి అమ్మేయండి కొంత డబ్బు వస్తుంది కదా అని సలహా ఇచ్చింది. ఆమె సలహా మేరకు ఆ గిల్టు నగలను తీసుకెళ్లి నార్త్ షీల్డ్ లోని పిటోన్బీ ఆంక్షనీర్స్ అనే సంస్థకు అందించి అమ్మిపెట్టమంది. ఆ గిల్లు నగలు, అందులోని రాయిని పరిశీలించిన సంస్థ, ఆ రాయి 34 క్యారెట్ల బరువైన వజ్రం అని, దానిని వేలంలో అమ్మితే కనీసం రూ.20 కోట్లు వస్తాయని తెలియజేసింది. దీంతో ఆ మహిళ ఎగిరి గంతేసింది.
Read: అమెరికాకు పరోక్ష హెచ్చరికా: వన్ చైనాకు అడ్డువస్తే…