వ్యాపార రంగంలో రిలయన్స్‌కు ఎదురేలేదు.. కొత్త రంగాలకు వ్యాపారాలను విస్తరిస్తూ.. లాభాలను ఆర్జిస్తూనే ఉంది ఆ సంస్థ.. ఇక, గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఆ సంస్థ.. ఇప్పటికే జామ్‌నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో చేతులు కలుపుతోంది.. అందులో భాగంగా.. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే మంచి పేరు పొందిన ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనేసింది.. ఆ కంపెనీకి సంబంధించిన వంద…
కరోనా, ఒమిక్రాన్‌తో యూకే వణికిపోతున్నది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ తరువాత కేసులు మరింతగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున యూకేలో 1.30 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లండన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.…
ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 1,22,186 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తరువాతనే కరోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. Read: ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్… డిసెంబర్…
చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్‌ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్‌లో 7500 బిట్ కాయిన్స్…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పెద్దగా ముప్పు లేదనే అంచనాలున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. డెత్ రేట్ చాలా తక్కువంటూ ప్రచారం సాగింది.. కానీ, ఒమిక్రాన్ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించింది బ్రిటన్.. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని ఇవాళ వెల్లడించిన బ్రిటన్ ఉప ప్రధానమంత్రి డొమినిక్ రాబ్.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్ బాధితులు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా ప్రంపచదేశాలకు వ్యాపిస్తోంది.. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 89 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.. మరోవైపు.. ఒమిక్రాన్ నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.. కిస్మస్…
యూరప్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వీరలెవల్లో వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ ప్రారంభమైనప్పటికీ యూరప్‌లో దీనికి సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్నది. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 3201 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 14,909కి చేరింది. Read: ఇంటర్ ఫలితాలపై బోర్డ్ కీలక వ్యాఖ్యలు… ప్రపంచం మొత్తం మీద అత్యథిక…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం…
21వ శతాబ్దంలో దెయ్యాలు ఉన్నాయనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిత్యం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. అలాంటి సంఘటన ఒకటి ఇటీవలే యూకేలోని విల్డ్షైర్లో ఉన్న లాంగ్ ఆర్మ్ బార్లో జరిగింది. ఓ కస్టమర్ కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ బార్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఇంతలో కౌంటర్ డెస్క్‌లోని ఓ గ్లాస్ దానంతట అదే కిందపడి పగిలిపోయింది. మిగతా గ్లాసులన్నీ అలానే ఉన్నాయి. …
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 66 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా.. ఎవరూ మరణించలేదని.. సంబరపడుతున్న జనాలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇవాళ ఉదయమే ఒమిక్రాన్ సోకిన రోగి..…