Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ ఆ దేశ పార్లమెంటరీ విచారణను ఎదుర్కోబోతున్నారు. భార్య అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారానికి ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్య వ్యాపారానికి సహాయపడేలా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంపై విచారణ ఎదుర్కొనున్నారు. ప్రధాని నిబంధనలను ఉల్లంఘించారా..? లేదా..? అనే విషయాన్ని తేల్చేందుకు పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ స్వతంత్ర అధికారి డేనియల్ గ్రీన్ బర్గ్ ఈ విచారణ బాధ్యతలను…
Joe Biden - Rishi Sunak: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవం సందర్భంగా జో బైడెన్ మంగళవారం యూకేలోని ఉత్తర ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయనకు స్వాగతం పలికేందుకు బెల్‌ఫాస్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సమయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రదేశాల నేతల పర్యటనలో ఒకరినొకరు పట్టించుకోని సంఘటనలు ఎప్పుడైనా చూశామా.?
Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది.
Hindu temple vandalised: కెనడాలో మరోసారి హిందూ ఆలయంపై దుండగులు దాడి చేశారు. భారత వ్యతిరేక రాతలతో గుడిని ధ్వంసం చేశారు. నాలుగు నెలల్లో రెండోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఒంటారియోలో బుధవారం ఈ ఘటన జరిగింది. జనవరి 31న ఇలాగే బ్రాంప్టన్ లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా జరిగిన దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులు దేవాలయంపై పెయింటిగ్ స్ప్రే చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి…
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
London School of Economics: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఇ)లో భారత, హిందూ వ్యతిరేక దుష్ఫ్రచారం జరుగుందని ఆరోపిస్తూ ఓ భారతీయ విద్యార్థి తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారతీయుడు అయినందు వల్లే తానను స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పాల్గొనకుండా చేశారని పేర్కొన్నాడు.
S Jaishankar: యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం వీడారు. యూకేకు బుద్ధి వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు, ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జెండాను అవమానపరిచారు.