Today (20-01-23) Business Headlines: మైక్రోసాఫ్ట్ @ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.