Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య చిక్కుల్లో పడ్డాడు. ఒక అభిమానితో అతడు దురుసుగా వ్యవహరించిన తీరు నెటిజన్లకు ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు.