మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశం మొత్తం మహా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీపై పట్టు కోల్పోకుండా అడుగులు వేస్తున్నారు. శివసేన పార్టీకి సంబంధించి మొత్తం 56 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే రెబెల్ గ్రూప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే వరసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు…
బాల్ ఠాక్రే వేసిన పునాదుల్ని బిజెపి కదిలించగలదా?మరాఠా సెంటిమెంట్‌ని రాజకీయ వ్యూహాలు ఓడిస్తాయా?శివసేనకి మళ్లీ పుంజుకునేంత శక్తి ఉందా?మహా రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి? పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వదిలి సొంత ఇంటికి వెళ్లిపోయాడు. కిడ్నాప్‌కు గురయ్యామంటా రెబల్ ఎమ్మెల్యేలు కొందరు వెనక్కి వచ్చారు. రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్యే అవతలి పక్షంలో చేరాడు. తిరుగుబాటు మానేసి దారికొస్తే, కూర్చుని మాట్లాడుకుందాం అని అధికార పక్షం ఆఫర్లు… వెరసి ప్రజాస్వామ్యమా ఇది లేక కేవలం…
మహారాష్ట్రలో రోజు రోజులు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై లోకన్ ట్రైన్ లలో ప్రయాణికులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సబర్బన్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కరోనా పరిస్థితి పై శుక్రవారం చర్చలు జరిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సబర్బన్ లో మళ్ళీ ముఖానికి మాస్క్ లు తప్పని సరిగా…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై తిరుగుబావుటా ఎగరేయడంతో సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే.. ఈ సంక్షోభానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు, చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు. కానీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే…