మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది.…
దేశంలో రాజకీయాల గతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడుతున్నారు కేసీఆర్. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే…
ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే…
బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి వివిధ రాష్ట్రాల సీఎంలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసీఆర్ కు ఫోన్…
‘భారతరత్న’ అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది లతాజీ మరణం. ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక లతాజీ చివరి చూపు కోసం ప్రధాని కూడా రాబోతున్నారు. Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ? తాజాగా లతా మంగేష్కర్…
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.…
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్ కొలువు తీరనుంది.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర…