యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామం.. గంగాధర్ సూరిబాబు శ్రీను సమీప బంధువులు.. సూరిబాబు శ్రీను దగ్గర గంగాధర్ అప్పు తీసుకున్నాడు.. ఏమి ఇబ్బందులు వచ్చాయో ఏమోగానీ ఈ మధ్యకాలంలో గంగాధర్ ఆర్థికంగా చితికిపోయాడు.. ఇల్లు కూడా కట్టాడు.. సూరిబాబు గంగాధర్ కలిసి కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు.. బంధువులైనప్పటికీ చేసిన అడగడం మామూలే.. అదే రీతిన సూరిబాబు, శ్రీనులు గంగాధర్ ను తీసుకున్న అప్పు చెల్లించాలని ఈ మధ్య తరచూ అడగడం మొదలుపెట్టారు.. వడ్డీ కూడా కట్టకపోవడంతో మరింత…
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దులను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందారు. బైక్ ను ఢీకొన్న తర్వాత కంటైనర్ పల్టీలు కొట్టింది. కేక్ కొనేందుకు బైక్ పై బయల్దేరిన బావ బామ్మర్దులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు వివేక్ నగర్ తండాకు చెందిన శ్రీనివాస్, నవీన్ గా గుర్తించారు. Also Read:Vallabhaneni Vamsi:…
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు..
టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బలూచిస్థాన్ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఈ సమాచారం ఇచ్చింది. నివేదికల ప్రకారం.. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం కారణంగా బషీర్ అహ్మద్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. డేరా మురాద్ జమాలీలో మొదటి సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు తరలించారు. విచారణ…
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.