నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దులను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందారు. బైక్ ను ఢీకొన్న తర్వాత కంటైనర్ పల్టీలు కొట్టింది. కేక్ కొనేందుకు బైక్ పై బయల్దేరిన బావ బామ్మర్దులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు వివేక్ నగర్ తండాకు చెందిన శ్రీనివాస్, నవీన్ గా గుర్తించారు.
Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అధిక స్పీడు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.