దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రి కర్ఫ్యూ పెట్టి, పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. Read Also:ఒమిక్రాన్‌పై యుద్ధానికి.. ఆ దేశంలో నాలుగో డోసు దీని వల్ల కేసుల సంఖ్య…
వ్యాపారంలో ఎంతటి బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. రీసెంట్‌గా ట్విట్టర్‌లో కాళ్లు చేతులు లేని ఓ దివ్యాంగుని వీడియోను పోస్ట్ చేశాడు. కాళ్లు చేతులు లేకున్నా ఆత్మాభిమానంతో టూవీలర్‌ను తనకు అనువైన వాహనంగా మార్పులు చేయించుకొని ఒకచోట నుంచి మరోక చోటుకు వస్తువులను చేరవేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: నమ్మకాలు: కొత్త సంవత్సరం రోజున ఇలా చేస్తే……
కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో వన్యమృగాలు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ ఖాళీగా మారిపోవడంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చాయి. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో వన్యమృగాలు జనావాసాల్లోకి రావడం తగ్గిపోయింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి చిరుతలు వచ్చి భయపెడుతున్నాయి. ఓ ఇంట్లోని పెంపుడు శునకం గేటు ముందు నిలబడి పెద్దపెద్దగా మొరుగుతున్నది. రాత్రి వేళ కావడంతో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. Read:…
ఐపీఎస్ అధికారి సజ్జనార్.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరి స్తున్నారు. ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది.. సొంత ఊర్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్లకు వెళ్తారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి దిమ్మ తిరిగే కౌంటర్…
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం పై చాలా మంది ఫైర్ అవుతున్నారు.అయినా దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రముఖులు తమైదైన రీతిలో ట్వీట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీలో ఈ టిక్కెట్ రేట్లతో థియేటర్లు నడపలేమంటూ మూసివేశారు. పెద్ద పెద్ద థియేటర్లన్ని మూత పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ ట్వీట్ చేశారు.…
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో 300లకు పైగా…
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో దూమారం చేలరేగుతున్న విషయం తెల్సిందే..దీని పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిఏసీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ బస్తా రేటు కూడా ₹100 కి తీసుకొచ్చి.. దేశ చరిత్రలోనే నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి అంటూ ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సిమెంట్ బ్యాగ్ మీద మీ కమిషన్లు తగ్గించు కుంటే వాటి…
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు…
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను…
న్యూఢిల్లీ : ఇండియన్ ఎక్స్పో 2020 లో భాగంగాప్రధానమంత్రి నరేంద్రమోడీతో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్, హీరో రామ్ చరణ్ భార్య కొనిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె ‘ఇండియన్ ఎక్స్పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే…