సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని తెలిపారు. సంక్రాంతి శుభసందర్భంగా అందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేలా అందరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు లోబడే సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించారు. సంపన్నమైన ఆరోగ్యవంతమైన…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా…
మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీ ద్వేష పూరిత ప్రచారానికి సరైన సమాధానమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టమని కేటీఆర్ అన్నారు. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ విమర్శల దాడులకు దిగారు. బీజేపీ విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఓ నెటిజన్ జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి..? మిమ్ముల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం అంటూ ట్వీట్ చేయగా సొంత రాష్ట్రానికి…
వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వారిలో ఒకరు ఆనంద్ మహీంద్రా. కొత్త కొత్త విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఇక జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఓ ఫొటోను షేర్ చేశాడు. క్లాస్‌రూమ్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చొని దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఆడిగిన ప్రశ్నలకు వెరైటీగా ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు. తనకు ఎనర్జీ లెవల్స్ తగ్గినపుడు క్లాస్‌రూమ్‌కు వచ్చి…
తెలంగాణ రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తున్నా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. Read Also: తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం…
మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అధికార టీఆర్‌ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులు చనిపోతున్న సర్కార్‌కు పట్టడం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవండంటూ షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి,బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి,దేశ రాజకీయాల మీద చర్చ…
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శలు గుప్పించారు.‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయిందని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ట్విట్టర్‌లో ఆయన పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట. వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. మా బాబే సీఎం అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు.…
దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…
వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.…
తెలంగాణలో ఇటీవల జరిగిన బదిలీలపై మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో చోటుచేసుకుంది. బాబాపూర్‌కు చెందిన సరస్వతి ఇప్పటివరకు స్వగ్రామంలోనే పనిచేసింది. ఇటీవల ఆమెను నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దాంతో మనస్తాపం చెందిన సరస్వతి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Read Also: చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మరు:…