ఇండియన్ టెకీలకు ప్రపంచంలో భారీ డిమాండ్ ఉన్నది. ప్రపంచంలోని టాప్ కంపెనీలు సీఈఓలుగా భారతీయులను నియమించుకుంటున్నది. కష్టపడే తత్వం భారతీయుల లక్షణం కావడంతో కంపెనీ సీఈఓలుగా నియమితులవుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు నియమితులైనారు. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పరాస్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీనిపై స్టైప్ కో ఫౌండర్, ఐరిష్ బిలినియర్ స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో నూతన సీఈవో ఎంపిక విషయమై జాక్ డోర్సీ, ట్విట్టర్ బోర్డు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. జాక్ డోర్సీ వారసుడిగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. గతేడాది నుంచే డోర్సీని సీఈవోగా సాగనంపేందుకు ట్విట్టర్‌బోర్డు సిద్ధమైంది. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తలపై స్పందించేందుకు సంస్థ అధికార ప్రతినిధులేవ్వరు అందుబాటులోకి రాలేదు. డోర్సీ…
వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం తమ మాటలతో ఒకరిపై ఒకరూ విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులకు సాయం అందించేందు పర్యటిస్తూ ప్రజల బాధలను తెలుసుకుని సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయంగా మార్చే పనిలో పడి మాటలతో విమర్శల దాడులు చేస్తున్నారు. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తాజాగా చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శల…
టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వా మ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సం ఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీ సులు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్ వేదికగా గోబ్యాక్‌స్టాలిన్ హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు…
వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఫైర్ అయ్యారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన…
వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను ఒప్పించడంలో విఫలమ య్యామని, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకు న్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లా డారు. మూడు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా రైతులను ఒప్పిం చలేకపోయినందుకు విచాచారం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో, ప్రభుత్వం ప్రతి స్థాయిలో రైతులతో చర్చలు జరపడానికి ప్రయత్నించింది.…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పాలనపై పట్టు తప్పుతోంది. మెడికల్ విద్యార్థుల మధ్య సమన్వయం చేస్తూ ఉత్తమ బోధన చేయాల్సిన ప్రొఫెసర్లు అధిపత్యపోరులో మునిగి తేలుతుండడంతో మెడికల్ విద్యార్థుల్లో వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి.. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య ఏకంగా గొడవ చోటు చేసుకుంది. కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య గొడవ చోటుచేసుకుంది. హాస్టల్-1లో సీనియర్ల అనుచిత ప్రవర్తన పైన మోదీ, కేటీఆర్ కు ట్వీట్ చేశాడో…
సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని…