ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం పై చాలా మంది ఫైర్ అవుతున్నారు.అయినా దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రముఖులు తమైదైన రీతిలో ట్వీట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీలో ఈ టిక్కెట్ రేట్లతో థియేటర్లు నడపలేమంటూ మూసివేశారు. పెద్ద పెద్ద థియేటర్లన్ని మూత పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ ట్వీట్ చేశారు.
తాజాగా ఈ అంశంపై వైసీపీ పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన ట్విట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోఉంది. ఏపీలో లేదు. కానీ 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది.లైట్ బాయ్ నుంచి స్టార్ హిరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్ పెద్దలు, ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలని ట్వీట్ చేశారు.
Telugu film Industry is located in Hyd
— Margani Bharat (@BharatRam_MP) December 26, 2021
Not In AP
But 70% of Revenue is generating from AP @ysjagan ji
Right from Light boy to Star Hero's earnings from AP
Amdist Tollywood Bigges has to come forward to setup TFI in AP@telugufilmnagar@Goap Have to explore some slab of taxes