తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రి కేటీఆర్. మీతో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిలో నెటిజన్లు వారికి సంబంధించిన వివరాలు, సూచనలు అందించాలని కోరారు. అయితే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని…
రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా,…
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. మస్క్ ట్విటర్ ఫాలోవర్లలో సగానికి సగం మంది ఫేక్ అని వెల్లడైంది. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్‌కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో 48 శాతం మంది ఫేక్ అని తేలినట్లు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ ఖాతాల్లో…
భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈద్ ముబారక్ ఫొటోస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. పలువురు ప్రముఖులు అభిమానులకు ట్విట్టర్…
ట్విటర్ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చేసింది. 44 బిలియన్ డాలర్లు చెల్లించి ఆయన ఈ కంపెనీని సొంతం చేసుకున్నారు. దీంతో త్వరలోనే ఆయన ట్విట్టర్ సంస్థను తన అధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం మస్క్ చేతిలోనే ట్విట్టర్ సంస్థ పాలనా పగ్గాలు ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ కొనుగోలుతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో ట్విట్టర్ షేర్ల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కార్పొరేట్ దిగ్గజంగా ఎదగడంతో…
ప్రపంచ ధనికుడు ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాదారుడయ్యారు. అయితే ఆ తరువాత మొత్తం ట్విట్టర్‌నే కొంటానని ప్రకటించారు. దానికి కోసం కావాల్సిన వ్యూహాలను రచించి.. చివరికి ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చేలా చేశారు. ఎట్టకేలకు ఎలాన్ మస్క్ అనుకున్నట్లు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోబుతున్న వేళ… ఎలాన్ మస్క్ ముందు రిపబ్లికన్లు ఓ కోరికనుంచారు. అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం రద్దు…
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించాడు. ఇటీవల ట్విట్టర్‌లో వాటాదారుడైన ఎలాన్.. ట్విట్టర్‌లోని ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న ట్విట్టర్ యాజమాన్యం గందరగోళంలో పడింది. అంతేకాకుండా ఎలాన్ మస్క్ వాటాదారులతో విరివిగా సమావేశాలు నిర్వహించి.. ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతుండడంతో దిగొచ్చిన ట్విట్టర్ యాజమాన్యం.. ఎలాన్‌తో సమావేశమైంది. అయితే ఈ సమావేశం అనంతరం.. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు…
దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఆయన.. ఇక, ట్విట్టర్ యాజమాన్య బోర్డులో చేరడం ఖాయమని అంతా భావించారు.. కానీ, ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు ఎలాన్ మాస్క్.. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు.. ట్విట్టర్‌లో ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు 9.2 శాతం వాటా ఉంది… ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే కూడా…
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం…
తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది… అభివృద్ధిలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకుంది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది… ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) వెల్లడించింది.. 2021-22లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతంతో పరుగులు పెట్టి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. తలసరి ఆదాయంలో సైతం 18.8 శాతం…