పులి కనిపిస్తే చాలు చాలా వరకు పక్షలు, జంతువులు దాని సమీపంలో ఉండేందుకు ప్రయత్నించవు. కానీ దానికి భిన్నంగా ఓ బాతు మాత్రం పులిలో దాగుడుమూతలు ఆడింది. ఆకలితో ఉన్న పులి బాతుపై అటాక్ చేయడానికి రావడంతో వెంటనే నీటిలో మునిగిపోతూ పులికి మస్కా ఇచ్చింది. ఓ కొలనులో ఉన్న పులి నేర్పుతో, ఓపికగా, నిదానంగా బాతుపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బాతు నీటిలో మునిగిపోతుంది. దీంతో పులి అయోమయానికి గురై అటూ ఇటూ చూసుకుంటుంది.…
ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోగా.. ట్విటర్‌ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్‌పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్‌పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో…
ట్విటర్ మాధ్యమంగా ఛలోక్తులు పేల్చినంత మాత్రాన ఎలాన్ మస్క్ చాలా క్లాస్ & దయగలిగిన వ్యక్తి అనుకుంటున్నారా.. మాస్, ఊర మాస్! ఇందుకు తాజా పరిణామమే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత తన సంస్థ ఉద్యోగులకు ఇటీవల ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆఫీస్‌కి వచ్చి పని చేస్తేనే జాబ్ ఉంటుందని, లేకపోతే ఊడిపోవడం ఖాయమని ఆయన మెయిల్ పంపించాడు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది. ‘‘ఇకపై ఇంటి నుంచి లేదా ఇతర…
టీమిండియా స్టార్ బ్యాటర్ KL రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తింది ప్రముఖ సీనియర్ నటి కస్తూరి. రాహుల్ చేసిన ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుందని ఆమె తెలిపింది.తాజాగా KL రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కొత్త సంప్రదాయానికి నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఎంతగానో…
మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ పెట్టిన వైసీపీ పార్టీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలను కైవసం చేసుకొని కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు మెజారిటీతో ఏపీ లో అధికారాన్ని చేపట్టింది. అయితే జగన్ అధికారం చేపట్టి నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ కుబేరుడి స్కెచ్చేంటి?ట్విట్టర్ డీల్ వెనుక లక్ష్యమేంటి?లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంత ? ఎలాన్ మస్క్.. మామూలోడు కాదు..ప్రపంచ కుబేరుడిగా ఎదిగేంత వరకు నిద్రపోలేదు..కొత్త కొత్త ప్రాజెక్టులతో సంచలనంగా మారతాడు.పెట్టుబడులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు..చివరికి చెప్పేదొకటి చేసేదొకటి అనిపించుకుంటాడు..అసలు సిసలైన మాయగాడిగా నిలబడతాడు.కానీ, అసలు టార్గెట్ అమెరికా రాజీకీయాల్లో చక్రం తిప్పటమేనా?ఇదే ఇప్పుడు నడుస్తున్న చర్చ చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేకపోవడం రాజకీయ నాయకుల లక్షణం.ప్రపంచ కుబేరుడిగా, సక్సెస్ ఫుల్ గా బిజినెస్ మ్యాన్ గా…
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది.. ట్విట్టర్ హ్యాండిల్ బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలని గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు నాగేశ్వరరావు.. అయితే, బ్లూ టిక్ పునరిద్ధరించాలని ట్విట్టర్ కోరిన పునరుద్ధరించకపోవడంపై మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ మాజీ డైరెక్టర్.. అయితే, ట్విట్టర్ లో బ్లూటిక్‌ను పునరుద్ధరించాలని తాజాగా హైకోర్టులో పిటిషన్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది.. అంతేకాదు.. సీబీఐ…
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేతగా ఉన్న మస్క్ ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ట్విట్టర్ డీల్ ను కొంతకాలం నిలివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు మస్క్. ఫేక్ అకౌంట్లపై విచారణ ముగిసే దాకా ట్విట్టర్ డీల్ కు బ్రేక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ప్రీ మార్కెట్ లో…
ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ జీ.. మీరు గుజరాత్ కే కాదు భారత దేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై…
హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం వుడెన్ కలర్‌తో రూపొందించిన ఈ…