KTR: మోదీ జీ.. మీరు గుజరాత్‌కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ జీ.. మీరు గుజరాత్ కే కాదు భారత దేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అయితే గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయుబ్ పటేల్ అనే వ్యక్తిని మోదీని పలుకరించగా, తన కూతురు ఆశయాన్ని ప్రధాని ముందుంచారు ఆయన. తన బిడ్డ భవిష్యత్‌లో డాక్టర్ కావాలని కోరుకుంటుందని తెలిపారు. ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావని ఆయుబ్ పక్కనే ఉన్న కూతురిని మోదీ ప్రశ్నించాడు. మా నాన్న అనుభవిస్తున్న సమస్యే కారణమని ఆమె చెప్పి బోరున విలపించింది. సౌదీలో పని చేస్తున్న సమయంలో ఐ డ్రాప్స్ వేసుకోవడంతో కంటి చూపును కోల్పోయాడని చెప్పింది. మిగతా వారిలా ఆయన స్పష్టంగా చూడలేకపోతున్నారని ఆ యువతి చెప్పడంతో మోదీ కూడా భావోద్వేగానికి లోనై.. భవిష్యత్‌లో ఆమె కలను నెరవేర్చేందుకు తప్పకుండా సహాయం చేస్తానని మోదీ ప్రకటించారు. ఈ వీడియోను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ.. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్ ట్విట్టర్ ద్వాారా ప్రశ్నించారు.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
#WATCH | While talking to Ayub Patel, one of the beneficiaries of govt schemes in Gujarat during an event, PM Modi gets emotional after hearing about his daughter's dream of becoming a doctor & said, "Let me know if you need any help to fulfill the dream of your daughters" pic.twitter.com/YuuVpcXPiy
— ANI (@ANI) May 12, 2022
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!