"Khalistan" trending on Twitter: ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ అనుచరులు, బాడీగార్డులను కలుపుకుని 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ అంతటా ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు.
Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ గురువారం తెల్లవారుజామున హ్యాక్ చేయబడింది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ (BLUR) కనిపించింది.
Meta: ట్విట్టర్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వేదికగా నిలిచింది. ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ట్విట్టర్ కు పోటీగా కొత్త యాప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా. ట్విట్టర్ ప్లేస్ ను ఆక్రమించేందుకు, దానికి పోటీగా నిలిచేందుకు కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో మెటా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ హోలీ సందర్భంగా విడుదల చేసిన తన తాజా వీడియో ప్రకటన ట్రోల్ చేయబడుతోంది. ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రకటన హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tractor Goes Viral : ప్రస్తుతంలో సోషల్ మీడియాలో ఓ ట్రాక్టర్ చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Twitter Down: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి పనిచేయలేదు. కొన్ని గంటల పాటు నెటిజెన్లు తమ ట్వీట్లను, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇలాగే ట్విట్టర్ డౌన్ అయింది. తాజాగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ అంతరాయాన్ని ఎదుర్కొంది.