ట్విట్టర్ లోగోను మరో సారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూ బర్డ్ లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌నుట్విట్టర్ లోగోగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
Twitter Logo Changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ తన లోగోను మార్చింది. ఇది చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న ‘‘బ్లూ బర్డ్’’ కనిపించడం లేదు. కొత్తగా బ్లూబర్డ్ స్థానంలో ‘‘డాగ్‌కోయిన్’’ లోగోను తీసుకువచ్చారు. జపాన్ మూలాలు కలిగిన కుక్క జాతి షిబా ఇనుగాను పోలిన డాగీ కోయిన్ ప్రస్తుతం ట్విట్టర్ లోగోగా దర్శనం ఇస్తోంది.
Twitter Blue Tick: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.. సీఈవో స్థాయి నుంచి టాప్ క్యాడర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి వరకు పెద్ద సంఖ్యలో ఉంగ్యోగులను ఇంటికి పంపాడు.. ఇక వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. అయితే, ట్విటర్ పెయిడ్ సబ్‌క్రిప్షన్ విధానంపై అనేక విమర్శలు వచ్చాయి.. కానీ, ఎక్కడా వెనక్కి తగ్గకుండా అమలు చేశారు ఎలాన్ మస్క్.. కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్‌లు…
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
పాకిస్తాన్‌కు భారత్‌లో బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా భారత్‌లో నిలిపివేయబడింది. దీనికి గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికి లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే ఇలా చేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో 30వ తేదీ గురువారం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసింది.
దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లావ్లీనా బోర్గోహైన్‌లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు.
తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో కొందరు సినీ నటులపై పంచ్‌లు వేస్తుంటారు. హస్యం కోసమే కొన్ని సెటైర్లు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంగా అవి వివాదాస్పదంగా మారిన సందర్భంగాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ టీవీ ఛానల్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ చేసిన ఓ స్కిట్ చర్చనీయాంశమైంది.