Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన ఆనంద్ మహీంద్రా వ్యాపారం రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటారు. స్పూర్తినిచ్చే ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఇలాంటి అంశంపైనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘‘ టెక్నాలజీపై ప్రకృతిదే విజయం’’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.…
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని…
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.
Rishab Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, కోలుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రిషబ్ పంత్ అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు…
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు.
50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.
Elephant Video Viral : బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ ను తొండంతో విసిరిపారేసింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను విస్తరింపజేస్తామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.
Elon Musk : ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన టైం ఏం బాగోలేదు.