Hanuma chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే సకల సంపదలు పొంది ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి.
హనుమాన్ చాలీసా వింటే సర్వాభీష్ట సిద్ధి, దుష్ట నివారణ కలుగుతుంది. చిరంజీవిగా పేరున్న అంజనీపుత్రుడి కటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి. అంతులేని సంపద మనకు స్వంతం అవుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆంజనేయుడిని తలచుకుంటే భయం పోతుంది.
శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.