నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
కరకం బాడి మార్గంలోని టీటీడీకి చెందిన శేషాచల నగర్ లోని 75వ నెంబర్ ఇంటిని స్వాధీనం చేసుకుంది టిటిడి. పంచనామా సందర్బంగా ఇంట్లోని పెట్టెలో 6 లక్షల 15 వేల 50 రూపాయల తో పాటు దాదాపు 25 కిలోల చిల్లర నాణాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఈ మొత్తం స్వాధీనం చేసుకున్న దానిని టీటీడీ ఖజానాకు జమ చేశారు అధికారులు. అయితే 2008లో టీటీడీ ఆ ఇంటిని తిరుమలకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తికి…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ…
హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులుకు పంపింది టిటిడి. టిటిడి చూపిన ఆధారాలు అసత్యాలు అయితే ఈ నెల 20వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని తీర్దట్రస్ట్ ప్రతినిధులను టిటిడి కోరింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత చర్చలకు సిద్దమని టిటిడి పేర్కొంది. టిటిడిపై హనుమద్ జన్మభూమి తీర్ద ట్రస్ట్ ఉపయోగించిన…
ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ నిర్ణయం వివాదం అవుతుంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాని తీవ్రంగా వ్యతిరేకించింది కిష్కింద దేవస్థానం అధికారులు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసారు కిష్కింద దేవస్థానం అధికారులు. ఆ లేఖలో టీటీడీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధికారులు.అజ్ఞానపు,మూర్ఖపు పనులు చెయ్యొదంటూ విజ్ఞప్తి చేసారు. మా లేఖకు వెంటనే సమాధానం ఇవ్వండి అని అడిగిన కిష్కింద ఆలయ అధికారులు మీ కమిటీ నివేదిక అభూతకల్పనని మేము…
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.
తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ…
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ.. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. దీంతో.. తిరుమలలో వందేళ్ల కిందటి సంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలోపున:ప్రారంభించామన్న ఆయన.. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేథ్యం సమర్పించాం.. అద్భుతంగా ఉందని భక్తులు ప్రశంసించారన్నారు.. లడ్డూ ప్రసాదం కూడా ఆర్గానిక్ పదార్థాలతో ప్రయోగాత్మకంగా తయారు చేయించామని.. లడ్డూ ప్రసాదం కూడా చాలా రుచికరంగా వచ్చిందన్నారు..…
కరోనా కారణంగా 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి చెందారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తునందు వలన వైరస్ సోకడం లేదని.. టిటిడి ఉద్యోగులు అందరికి యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుండటం కారణంగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులుకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తామని..గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాది…