న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రెండవ రోజు హైదరాబాద్ లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కే .జంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర…
ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద రెండేళ్ళుగా పెండింగులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ, పిఆర్సీ, డిఎ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. టిఎస్ యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బిల్లులు మంజూరు…
గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టిఎస్ యుటిఎఫ్ గురుకులం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. సోమవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో హరీందర్ రెడ్డి అధ్యక్షతన టిఎస్ యుటిఎఫ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (గురుకులం) ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Also Read: Ponnam Prabhakar: కేటీఆర్ ఓటమిని…
దేశంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్…
జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి.…
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్‌ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు…
పదవ తరగతి పరీక్షలు రద్దైనాయి. దిగువ తరగతులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింనందున ఆన్లైన్ క్లాసులు కూడా వినే స్థితిలో విద్యార్థులు లేరు.ఉపాధ్యాయులు మాత్రం ప్రతిరోజూ పాఠశాలలకు హాజరౌతున్నారు. ఈ నేపద్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయటం సమంజసంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి వినూత్న విద్యా పధకాన్ని ప్రారంభించటానికి…