పదోన్నతులు దక్కటం లేదనే ఆవేదనతో నిరసన తెలుపుతున్న పండితులను సస్పెండ్ చేయటాన్ని టీఎస్‌యుటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. టీఎస్‌యుటీఎఫ్ నేతలు తాజాగా ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అందులో.. సంవత్సరాల తరబడి ప్రమోషన్ లేకపోయినా, పాఠశాలల్లో వివక్షకు గురౌతున్నా….విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పోస్టులు అప్ర్గేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారని టీఎస్‌యుటీఎఫ్ పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్లో కూడా తమ పదోన్నతుల అంశం లేకపోవడంతో ఆవేదనకు గురైన భాషా పండితులు తమ జాబ్ చార్ట్ లో లేని హైయర్ క్లాస్ బోధన చేయబోమని ఇచ్చిన పిలుపు నిరసన మాత్రమే అన్నారు.
Also Read : Ravanasura: మాస్ మహారాజా.. నీ గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉందయ్యా
అయినా వారు అనధికారికంగా పాఠాలు బోధిస్తూనే ఉన్నారని, నిరసన లేఖల ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి విద్యాధికారులు భాషా పండితులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమన్నారు. డీఈఓల చర్యను టీఎస్‌యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని, భాషాపండితులపై వేసిన సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని, పదోన్నతులపై ఉన్న కేసును ప్రభుత్వం చొరవతీసుకుని వేకెట్ చేయించి, ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్లోనే పండితులకు సైతం పదోన్నతులు ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.
Also Read : MS Dhoni: ధోనీ గ్యారేజీలోకి కొత్త బైక్.. టీవీఎస్ రోనిన్ ప్రత్యేకతలు ఇవే!