ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHK ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా, జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్‌కు సునామీ…
Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
శక్తివంతమైన భూకంపం రష్యాను వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు వణికిపోయాయి. కామ్చాట్కా ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తున్నారు.
Earthquake: అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లోనూ వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. అదే విధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. ఇదివరకు కూడా జూలై 17న అలాస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 36…
జపాన్‌లో భూకంపం సంభవించింది. క్యుషులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం 7:34 గంటలకు 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు.
టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పంగైకి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా ఏజెన్సీ తెలిపింది.
Earthquake : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫెర్నాడేల్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.
Japan Earthquake : జపాన్‌లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని మరణాలు సంభవించాయి.
Earthquake: ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షినంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.
Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.