టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పంగైకి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా ఏజెన్సీ తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో తీవ్రప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు ఎగిసి పడే అవకాశం ఉందని పసిఫిక్ పేర్కొంది.
భారీ భూకంపంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
టోంగా అనేది పసిఫిక్ మహాసముద్రంలో 170కి పైగా ద్వీపాలు ఉన్నాయి. 36 నివాసయోగ్యమైన ద్వీపాలు కలిగిన ఒక ద్వీప దేశం ఇది. రాజధాని నూకలోఫా. టోంగాలో పర్యాటకం, వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు పేరుగాంచింది. ఇదిలా ఉంటే టోంగాలో తరచుగా వాతావరణ విపత్తులకు గురవుతుంది.
శుక్రవారం శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్ గజగజ వణికిపోయాయి. 7.7 తీవ్రతో భారీ భూప్రకంపనలు రావడంతో భవంతలు కుప్పకూలాయి. ఇప్పటివరకు 1700 మంది చనిపోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మరోవైపు శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకోవైపు ప్రపంచ దేశాలు.. సాయం చేయడానికి ముందుకొచ్చాయి.