జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపంతో ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. సైన్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరిక జారీ చేసింది. సునామీ అలలు 10 అడుగుల వరకు ఎగరిపడొచ్చని ఆ ఏజెన్సీ తెలిపింది. జపాన్ ఉత్తర తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం వచ్చిన వెంటనే, ఈశాన్య తీరంలోని అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
Also Read:భారత మార్కెట్‌లో HMD కొత్త HMD 100, HMD 101 ఫీచర్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఇవే..!
నీటి అడుగున కేంద్రీకృతమైన భూకంప కేంద్రం సునామీ ప్రమాదాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం ముఖ్యంగా జపాన్ ఈశాన్య తీరానికి ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ గత సంవత్సరాల్లో భారీ సునామీలు సంభవించాయి. JMA ప్రకారం, సునామీ అలలు 3 మీటర్లు (సుమారు 10 అడుగులు) వరకు చేరుకోవచ్చని తెలిపింది. ఇషికావా ప్రిఫెక్చర్, పరిసర ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారనున్నాయి. ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి తీరప్రాంతానికి దూరంగా ఉండాలని ఏజెన్సీ కోరింది.
Also Read:Hydra: రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల ఆక్రమణల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
అవసరమైన వారికి సహాయం అందించడానికి అత్యవసర సేవలను ప్రారంభించామని అధికారులు తెలిపారు. టీవీ ఛానెళ్లలో అత్యవసర సమాచారం నిరంతరం ప్రసారం అవుతోంది. స్థానిక నివాసితులు, పర్యాటకులు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు కోరారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి అధికారిక వివరాలు ప్రకటించలేదు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.