శక్తివంతమైన భూకంపం రష్యాను వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు వణికిపోయాయి. అయితే కామ్చాట్కా ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆస్పత్రి భవనం ఊగడం ప్రారంభించింది. వెంటనే సిబ్బంది స్ట్రెచర్ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇక డాక్టర్లు కూడా ఏ మాత్రం భయాందోళన చెందకుండా అక్కడ్నే ఉండిపోయారు. ఓ వైపు ప్రకంపనలు జరుగుతుండగానే.. ఇంకోవైపు వైద్యులు సర్జరీ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యుల నిబద్ధతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఓ వైపు ప్రమాదం పొంచి ఉన్న కూడా ధైర్యంగా సర్జరీ చేసిన వైద్యులకు హ్యాట్సాప్ చెబుతున్నారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. రోగి కోలుకుంటున్నారని రష్యన్ ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు స్థానిక మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Amit Shah: సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!
బుధవారం తెల్లవారుజామున రష్యాను భారీ భూకంపం వణికించింది. 8.8 తీవ్రతతో భూకంపం రావడంతో దేశం వణికిపోయింది. ఇక అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సాయంత్రం లేదా రాత్రికి భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అమెరికా, జపాన్, న్యూజిలాండ్‌కు కూడా భారీ సునామీ పొంచి ఉంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. సముద్రంలో భారీ స్థాయిలో అలలు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. సునామీని తక్కువ అంచనా వేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో రహదారులు రద్దీతో నిండిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు
Doctors in Kamchatka kept calm during the powerful quake — and never stopped the surgery
They stayed with the patient until the end
The patient is doing well, according to the Health Ministry pic.twitter.com/swtdBFSpm5
— RT (@RT_com) July 30, 2025