తెలంగాణలో సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. టెన్‌కోసం నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.