తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరినట్టు తెలిపారు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది.. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి…