TS Hig Court: ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యుల్ కిందకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్త జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు తీర్పును వెలువరించారు. దీంతో 75 ఏళ్ల పాటు ఆదివాసీలు చేసిన పోరాటం ఫలించింది. ఇక, ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వారు ఐదు షెడ్యూల్ పరిధిలోకి రారని ఆదివాసీయేతరులు వాదనలు వినిపించారు. అయితే ఇందుకు సంబంధించి గతంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఆదివాసీయేతరుల అప్పీల్‌ను కొట్టివేసింది.
Read also: Warangal: కూతురు ప్రేమించిందని.. ప్రేమికుడి, స్నేహితుల ఇళ్లను తగలబెట్టిన సర్పంచ్
కొండలపై అడవుల మధ్య జీవిస్తున్నారు. కల్మషం లేని మనసు వారిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మెరుగుదల లేదు. నేడు, అనేక గిరిజన గ్రామాలు వైద్యం, విద్య మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆదివాసీలు బతుకు పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వారి నివాసాలు ఒకప్పుడు సహజ వనరులతో సమృద్ధిగా ఉండేవి. అనేక దేశాల్లో ఆదివాసీలకు ఇప్పటికీ తగిన గుర్తింపు మరియు రక్షణ లేదు. అడవి తల్లి ఒడిలో సహజ వనరులను కాపాడుకోవడంలో గిరిజనులు చేస్తున్న కృషి ఎనలేనిది. సహజ వనరులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహజ వనరుల పరిరక్షణ కోసం ఆదివాసీల సహకారం, పోరాటం గొప్పది. ఆధునిక సమాజంలో కొత్త పోకడలతో దూసుకెళ్తున్నా.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు. ఇటువంటి ఆదివాసీయుల కళ ఎట్టకేలకు నెరవేరింది. 75 ఏళ్ల పాటు ఆదివాసీలు చేసిన పోరాటం నేటితో ఫలించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని కోర్టు తీర్పుతో ఆదివాసీలకు పండగవాతావరణం నెలకొంది.
Bandi Sanjay: మీ అందరికి అభినందనలు.. బండి ట్విట్ వైరల్