పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ ప్రగతి, ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదని.. ముస్లిం రిజెర్వేషన్ ఎత్తేస్తామని చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడితేనే కోర్టులో కేసు వేశామని గుర్తుచేశారు. మైనార్టీలకు ఇచ్చిన రిజెర్వేషన్ మతం ప్రామాణికంగా ఇవ్వలేదన్నారు. అది పేదరికం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ అన్నారు. దేశ ప్రధాని మోడీ హిందు, ముస్లిం అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాకే సిగ్గుగా అనిపిస్తుందన్నారు. మోడీకి ముస్లిం రిజర్వేషన్లు పై తీసుకున్న జీవో, కోర్టుల ఆదేశాల కాపీలు పంపుతున్నామని తెలిపారు. అనవసరంగా ముస్లిం రిజర్వేషన్ పై మాట్లాడితే మోడీ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రధాని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మోడీ కి చదువు రాదా.. రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో తెలుసుకుంటే మంచిదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు కు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనేం ప్రధాని అన్నారు.
READ MORE: Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన బయటకు వచ్చింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు కల్పిస్తోన్న 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు కాంగ్రెస్ కల్పిస్తోన్న 4 శాతం మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తోన్న విషయం విదితమే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ షబ్బీర్ అలీ మాట్లాడారు. ఎన్నికల్లో దేశంలో జరిగిన అభివృద్ధి, ఉద్యోగాలు తదితర విషయాల గురించి మాట్లాడాలని సూచించారు.