TS Congress: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Minister Srinivas Goud: గురువులు, శిష్యులు ఇద్దరూ ఒక్కటేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గతంలో చంద్రబాబు వ్యవసాయం నేరమని చెప్పారని, ఇప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఎందుకని రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. గురువులు, శిష్యులు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. నాడు కరెంటు అడిగిన రైతులను లాఠీలతో తొక్కితే బాబుకు ఏమైందో,…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు కానుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
TS Congress: సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ లోని భట్టి నివాసానికి వచ్చి ఆయనతో పలు అంశాలపై చర్చించారు.
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 84 నుంచి 119కి పెంచాలని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శులకు ఆదేశించింది.
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీలు వారి బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నజర్ సారించింది. భారీ చేరికల దిశగా ఫోకస్ పెట్టింది. ఆపరేషన్, ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని హస్తం నేతలు చూస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ రచ్చకెక్కిందా? కీలక నాయకులంతా ఫోకస్ పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయా? హైకమాండ్ చెంతకు మరో ఫిర్యాదు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ గొడవేంటి? గొడవలు వస్తే సర్దిచెప్పే నేతలే పేచీలు? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అందరూ కీలక నాయకులే. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలుకుని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి.. ఇలా అందరూ సీనియర్లే. కానీ తుంగతుర్తి నియోజకవర్గం…