Minister Srinivas Goud: గురువులు, శిష్యులు ఇద్దరూ ఒక్కటేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గతంలో చంద్రబాబు వ్యవసాయం నేరమని చెప్పారని, ఇప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఎందుకని రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. గురువులు, శిష్యులు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. నాడు కరెంటు అడిగిన రైతులను లాఠీలతో తొక్కితే బాబుకు ఏమైందో, నేడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పట్టిందని జోస్యం చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబ్ నగర్ లో బీఆర్ ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో జరిగిన ధర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వ్యవసాయానికి కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం రైతులను అవమానించడమేనన్నారు.
Read also: Puvvada Ajay Kumar: కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్
ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి వక్రబుద్ధి బయటపడిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయన్నారు. రైతుల విషయంలో శాంతిభద్రతలు ఉండవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంటుకు ఉరిశిక్ష పడుతుందా? వారికి కోపం వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు నిరసనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొని నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Hyderabad Bike Stunt: పోతావ్ ర రేయ్.. గర్ల్‌ప్రెండ్ వెనుక కూర్చుంటే ఇంత పైత్యం అవసరమా?