తెలంగాణ కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పైరవీలకు తావులేకుండా రేషన్ కార్డులను అర్హులైన పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందిని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రజారాజ్యం, ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొన్ని అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇండ్లు, సొంత…
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే…
నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 17 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేస్తుంది.. తద్వారా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనిపై కూడా నేటి మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.. దీనిపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది.. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2022-23కి ఆమోదం తెలుపనున్నారు. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ తాజా పరిస్థితి, మహమ్మారి విజృంభిస్తే.. ఎదుర్కోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో…