తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్.. క్వారంటైన్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే అవకాశం ఉండగా… మాల్స్, థియేటర్లు, పబ్‌లపై నియంత్రణా చర్యలు చేపట్టే విధంగా ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. ఇక, వ్యాక్సినేషన్…
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి.…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది.. మొదటగా కోవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.…
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో వరుసగా రెండోరోజు సమావేశమైన తెలంగాణ కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి…
రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.
పీఆర్సీ అమలు కోసం గత కొన్ని నెలలుగా ఎరుదుచూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంతో.. ఇక త్వరలోనే అమలు అవుతాయని.. జీతాలు పెరుగుతాయని అంతా ఎదురుచూస్తూ వచ్చారు.. అయితే, ఉప ఎన్నికలు, మరికొన్ని కారణాలతో పీఆర్సీ అమలు వాయిదా పడుతూవచ్చింది. కానీ, రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దానికి మోక్షం లభించే అవకాశం ఉంది.. రేపటి కేబిట్ సమావేశంలో పీఆర్సీపై చర్చించనున్నారు.. ఉద్యోగుల వేతన సవరణ పూర్తి నివేదికను…