TS Cabinet: కొనసాగుతున్న తెలంగాణ కేబినేట్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించి ఆమోదం పొందనున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు.
Also Read : Summer Camps : వేసవి శిబిరాలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధం
Also Read
మరోవైపు ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగుటు వేస్తోంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దళితబంధు పథకం అమలుపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక, నిధుల సమీకరణపై కూడా కేబినేట్ చర్చించే అవకాశం ఉంది.
Also Read : Papaya Seeds: బొప్పాయి తిని గింజలు పడేస్తున్నారా? అవి తింటే పురుషులలో వచ్చే..
విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పండింది. ఈడీ కేసును ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాని అనే అంశంపై నేతల అభిప్రాయాలు సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. కాగా, రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు.
- Tags
- cm kcr
- Kavitha
- Telagana
- TS Cabinet
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!