తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు ఐదుగంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. దళితబంధు, గృహలక్ష్మి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాలపై సీఎం అధ్యక్షతన మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. దళిత బందు, పోడు భూములు, డబల్ బెడ్ రూం ల పై నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బందు ఇవ్వాలని నిర్ణయం.. డబల్ బెడ్రూం హౌసింగ్ లో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం తీసుకువచ్చేందుకు నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు.
Also Read : Emergency Landing: ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
‘నాలుగు లక్షల మందికి ఇల్లు… నియోజక వర్గానికి 3 వేల ఇళ్లు.. లబ్దిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం.. ఒక్కో ఇంటికి మూడు లక్షల గ్రాంట్.. దళిత బంధు, డబుల్ బెడ్రూంలు, పోడు భూముల పట్టాల పంపిణీ పై క్యాబినెట్ లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నాము. లక్షా 30 వేల కుటుంబాలకు రెండో విడత పంపిణీ. దళిత బంధు పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక రాష్టాల వాళ్ళు వచ్చి దళిత బంధు పై తెలుసుకుంటున్నారు. దళిత బంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయం. 118 నియోజకవర్గంలో 1100 మందికి ఈ దఫాలో నిర్ణయం. 1,29,800 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఇస్తాం. 200 మందికి చీఫ్ సెక్రటరీ దగ్గర పెట్టాం. డబుల్ బెడ్రూమ్ 4 లక్షల ఇండ్లు ఇస్తాం. ఒక్కో ఇంటికి 3 లక్షల రూపాయల గ్రాంటుగా ఇస్తాం.
Also Read : DK Aruna : కేటీఆర్, కవిత ఇద్దరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు
మూడు లక్షల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తాం. దీనికి 12 వేల కోట్లు ఖర్చు అవుతుంది. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ళ మీద పేదలు తీసుకున్న రుణాలు మాఫీ. గొర్రెల పంపిణీ పథకం రెండో విడత పంపిణీ… 4 వేల 463 కోట్ల నిధులు విడుదల. ఏప్రిల్ నుండి పంపిణీ. నాలుగు లక్షల ఎకరాల పోడు భూములను 55,393 లబ్ధిదారులకు పంపిణీ. ఏప్రిల్ 14 న అంబేడ్కర్ విగ్రహం ప్రారంభం… లక్షలాది ప్రజల మధ్య కార్యక్రమం.. పెద్ద సభ. 58, 59 జీవో ల లబ్దిదారుల కు ధరకాస్తు కు మరో అవకాశం.. నెల రోజులు గడువు. కాశీ లో వసతి గృహం ఏర్పాటు చేయాలని… 25 కోట్లు మంజూరు. శబరిమల లో 25 కోట్ల తో వసతి గృహం… గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లను ఇంకా ఖరారు చేయలేదు.. టైమ్ ఉంది. బిల్లుల పెండింగ్ .. గవర్నర్ పై. సుప్రీం కోర్టు కు వెళ్ళడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు.
Addressing the Press Conference at Pragathi Bhavan https://t.co/ChkHp9Hv1t
— Harish Rao Thanneeru (@BRSHarish) March 9, 2023