Telangana Assembly: తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్న (శనివారం)తో ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తమిళసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ ఫిబ్రవరి 17 వరకు కొనసాగాయి.
మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
తెలంగాణ బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ కూడా అని ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. మీరిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని అన్నారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారు. మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటి? అని…
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంలో పాత ఒరవడినే ఉందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితికి బడ్జెట్ ప్రతిపాదనలకు పొంతన లేదని విమర్శించారు. రూ.5 లక్షల కోట్లు పెడితే కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు కావని ఈటల రాజేందర్ తెలిపారు.
సికింద్రాబాద్లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ విజయోత్సవ సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మరావు గౌడ్, మాగంటి గోపీనాథ్, పాడిడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. బడ్జెట్ మొత్తం నిరాశగా ఉందని విమర్శించారు. 6 పథకాల అమలుకు లక్షా 25…
గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులు అప్పగించలేదని తెలిపారు. ఎక్కడి నుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు…
తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం పై చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొ్న్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరు పక్షాలకు సూచించారు. సభ హుందాతనం కాపాడండి అని తెలిపారు. కొత్త సభ్యులు నేర్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత దూషణలు వద్దు.. మేము, వాళ్ళు ఇద్దరు వ్యక్తి గత దూషణలు వద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్…