తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంలో పాత ఒరవడినే ఉందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితికి బడ్జెట్ ప్రతిపాదనలకు పొంతన లేదని విమర్శించారు. రూ.5 లక్షల కోట్లు పెడితే కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు కావని ఈటల రాజేందర్ తెలిపారు.
KTR: బడ్జెట్ మొత్తం నిరాశగా ఉంది.. ప్రభుత్వంపై విమర్శలు
వ్యవసాయానికి రూ.19 వేల కోట్లు మాత్రమే పెట్టారు.. రైతుబంధు, కౌలు రైతులకు డబ్బులు, ధాన్యంకు రూ.500 బోనస్ కానీ, 2 లక్షల రుణ మాఫీ ఎలా చేస్తారని ఈటల ప్రశ్నించారు. ఈ ఏడాదిలో రుణమాఫీ చేస్తారా లేదా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది అబద్ధం అని స్పష్టం అయిందని అన్నారు. ఇదిలా ఉంటే.. నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని అన్నారు. బడ్జెట్ నవ్వుకునే విధంగా ఉందని విమర్శించారు.
PM Modi: బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
విద్యా రంగానికి బడ్జెట్ లో 15 శాతం పెడతామని చెప్పారు.. 7 శాతం మాత్రమే పెట్టారన్నారు. ఆటో డ్రైవర్లకు భృతి కూడా బడ్జెట్ పెట్టలేదు.. ప్రభుత్వం బెల్ట్ షాపులు రద్దు చేస్తుందా లేదా అని ప్రశ్నించారు. మహిళలకు పావుల వడ్డీ రుణం ప్రస్తావన లేదు.. దళితబంధు అమలు చేస్తుందా లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీరిచ్చిన హామీలకు బడ్జెట్ ప్రతీక.. బడ్జెట్ అలా లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. పీవీ నరసింహారావుకు భారత రత్న రావడం తెలుగు వారికి గర్వకారణమని చెప్పారు. పీవీనీ కాంగ్రెస్ పార్టీ అవమానించింది.. కష్టపెట్టిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.