ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ఇక అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ ట్రంప్ పక్కనే కనిపిస్తూ ఉండేవారు
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు.
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.
రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన సడన్‌గా అదృశ్యమయ్యారు. దీంతో ఆయనకు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది.